ఆదివాసీ మహిళపై గ్యాంగ్ రేప్

ఆదివాసీ మహిళపై గ్యాంగ్ రేప్
x
Highlights

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఆదివాసీ మహిళను కొందరు దుండగులు గ్యాంగ్ రేప్‌ చేశారు. అడవిలో కట్టెల కోసం వెళ్ళిన మహిళను చెరపట్టి...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఆదివాసీ మహిళను కొందరు దుండగులు గ్యాంగ్ రేప్‌ చేశారు. అడవిలో కట్టెల కోసం వెళ్ళిన మహిళను చెరపట్టి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బూర్గంపహాడ్ మండలం కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. నిస్సహాయురాలైన ఆమె రెండు గంటలపాటు అడవిలోనే రోదించింది. సాయంత్రం ఏడుస్తూ ఇంటికి చేరింది. కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలసి కృష్ణసాగర్‌ గ్రామానికి వచ్చి స్థానిక పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. స్థానికులు అంబులెన్స్‌ సహాయంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సుమారు ఇరవై ఐదేళ్ల వయసున్న బాధితురాలికి ఇద్దరు చిన్నపిల్లలు, భర్త ఉన్నారు. కాగా, దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలు భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories