గల్లా జయదేవ్ సరికొత్త ఛాలెంజ్ ‘హగ్ ఏ ట్రీ’!

గల్లా జయదేవ్ సరికొత్త ఛాలెంజ్ ‘హగ్ ఏ ట్రీ’!
x
Highlights

‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ పేరిట కొత్త విధానానికి కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల వేదికగా తమ...

‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ పేరిట కొత్త విధానానికి కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఫిట్ నెస్ వీడియోలను పోస్ట్ చేయాలంటూ పలువురు ప్రముఖులకు ఆయన సవాల్ విసరడం విదితమే.కాగా, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా సరికొత్త ఛాలెంజ్‌కు నాంది పలికారు. మన జీవితంలో పర్యావరణం, చెట్లు పోషిస్తున్న పాత్రను తెలియజెప్పే నిమిత్తం 'హగ్‌ ఏ ట్రీ' పేరిట కొత్త ఛాలెంజ్‌కు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. మన జీవితంలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తున్న చెట్లను గౌరవిస్తూ ఆప్యాయంగా హత్తుకుందామని ఆ ట్వీట్‌ లో పేర్కొన్నారు. ఒక చెట్టును జయదేవ్‌ ఆప్యాయంగా హగ్‌ చేసుకున్న ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా అశోక్‌ గల్లా, సిద్‌ గల్లా, సుధీర్‌ బాబు, హీరోలు సుమంత్‌, రానా దగ్గుబాటికి ఆయన ఛాలెంజ్‌ విసిరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories