logo
సినిమా

'చిరూ'ను కలిసిన టాప్ షూటర్..

చిరూను కలిసిన టాప్ షూటర్..
X
Highlights

మెగాస్టార్‌ చిరంజీవితో టాప్ షూటర్‌ గగన్‌ నారంగ్‌ భేటీ అయ్యారు. చిరుతో కాసేపు అయన మాట్లాడారు. మెగాస్టార్ ను...

మెగాస్టార్‌ చిరంజీవితో టాప్ షూటర్‌ గగన్‌ నారంగ్‌ భేటీ అయ్యారు. చిరుతో కాసేపు అయన మాట్లాడారు. మెగాస్టార్ ను కలిసిన విషయాన్నీ గగన్ నారంగ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయనతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. చిరూతో చిత్ర విశేషాలు, 'సైరా' నరసింహారెడ్డి సినిమా షూటింగ్‌కు సంబంధించిన విషయాలను మాట్లాడినట్టు తెలిపారు.

ఇదిలావుంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో అయన స్వాతంత్ర సమరయోధుడిగా నటిస్తున్నందున... గగన్‌ నారంగ్‌ వద్ద షూటింగ్‌కు సంబంధించిన మెలుకువల గురించి చర్చించినట్టు సమాచారం. ఇటీవలె జార్జియా షెడ్యుల్‌ను కంప్లీట్‌ చేసుకుంది చిత్రయూనిట్‌. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, సుధీప్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Next Story