ఇద్దరి ప్రాణాలు తీసిన వాట్సాప్‌ చాటింగ్‌

x
Highlights

సికింద్రాబాద్‌ మారేడుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరి మృతి కలకలం రేపుతోంది. శివకుమార్‌ అనే వ్యక్తి గత కొన్నిరోజులుగా తన...

సికింద్రాబాద్‌ మారేడుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరి మృతి కలకలం రేపుతోంది. శివకుమార్‌ అనే వ్యక్తి గత కొన్నిరోజులుగా తన భార్య ఫ్రెండ్‌ వెన్నెలతో చాటింగ్‌ చేస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన శివకుమార్‌ భార్య అతన్ని నిలదీసింది. అంతేకాకుండా తన ఫ్రెండ్‌, భర్త ప్రియురాలైన వెన్నెల ఇంటి దగ్గరకు వెళ్లి గొడవకు దిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శివకుమార్‌ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే శివకుమార్‌ మరణవార్త తెలిసి వెన్నెల తీవ్రంగా కుంగిపోయింది. తనవల్లే శివకుమార్‌ ప్రాణాలు కోల్పోయాడని తీవ్ర మనస్థాపం చెందిన వెన్నెల.. అదేరోజు యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే బంధువులు వెన్నెలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే 2 రోజుల పాటు చికిత్స పొందిన వెన్నెల నిన్న మృతిచెందింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories