లాలూ ప్రసాద్ కు మరో ఎదురు దెబ్బ

arun
By arun
Updated on: 24 Dec 2018 1:08 PM IST
లాలూ ప్రసాద్ కు మరో ఎదురు దెబ్బ
X

ఆర‌్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. దాణా కుంభకోణ వ్యవహారంలో ఆయనపై నమోదైన నాలుగో కేసులో కూడా లాలూ ను దోషిగా నిర్ధారిస్తూ రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. డుంకాలో జరిగిన దాణా కోనుగోలు వ్యవహారంలో 3 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ న్యాయస్ధానం నిర్ధారించింది. ఇప్పటికే లాలూను మూడు కేసుల్లో దోషిగా న్యాయస్ధానం తీర్పునివ్వడంతో జార్ఖండ్ లోని బిశ్రాముండా జైలులో శి‍‍క్ష అనుభవిస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ ను నిన్ననే ఆనారోగ్యానికి గురి కావడంతో స్ధానిక రిమ్స్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఇక ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి జగన్నాధ మిశ్రాను నిర్ధోషిగా న్యాయస్ధానం ప్రకటించింది.

arun

arun

Next Story