మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతికి గుండెపోటు

మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతికి గుండెపోటు
x
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి గుండె పోటుకు గురయ్యారు. విశాఖలోని పినాకిని ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శ్వాసకోశ సంబంధిత...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి గుండె పోటుకు గురయ్యారు. విశాఖలోని పినాకిని ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి జస్టిస్ పున్నయ్య (92)ను చూసేందుకు ప్రతిభా భారతి ఆసుపత్రికి వచ్చారు. ఆయన్ని చూసేందుకు శుక్రవారం ఆస్పత్రికి వచ్చిన ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను అదే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ప్రతిభా భారతి పరిస్థితి విషమంగా ఉందని, షుగర్‌ లెవల్స్‌ బాగా తగ్గిపోయాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతిభా భారతికి తండ్రితో అనుబంధం ఎక్కువని.. ఆయన పరిస్థితి చూసి ఆందోళనకు గురికావడంతోనే గుండెపోటు వచ్చిందని ఆమె కుమార్తె గ్రీష్మా ప్రసాద్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories