మంత్రి ఈటల మాజీ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు

nanireddy
Updated on: 24 Dec 2018 3:55 PM IST
మంత్రి ఈటల మాజీ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
X

మంత్రి ఈటల రాజేందర్‌పై అయన కారు మాజీ డ్రైవర్ మేకల మల్లేశ్‌యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన అయన మంత్రి ఈటల వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ ఆయనతో కలసి ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. అసెంబ్లీలో జరిగిన ఘటనలో 45 రోజులు జైలు శిక్ష అనుభవించినట్లు చెప్పారు. జైలు నుంచి విడుదలయ్యాక తనను సన్మానించి ఆర్థిక సాయం కింద రూ.30లక్షలు దాతలు ఇచ్చారని, వాటిని ఈటల తీసుకున్నట్లు ఆరోపించారు. జైలుకు వెళ్లడం ద్వారా తన ఉద్యోగం పోయిందని, ఆ తర్వాత కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నట్టు మల్లేశ్‌యాదవ్‌ చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని అయన పోలీసులను కోరారు.

nanireddy

nanireddy

Next Story