తుపాకీతో మాజీ ఎంపీ కొడుకు హల్‌చల్‌!

nanireddy
Updated on: 24 Dec 2018 3:29 PM IST
తుపాకీతో మాజీ ఎంపీ కొడుకు హల్‌చల్‌!
X

ప్రజాప్రతినిధుల పుత్రరత్నాలు రెచ్చిపోతున్నారు. సమాజంలో పది మందికి మార్గదర్శకంగా నిలవాల్సిన వారు గాడి తప్పుతున్నారు. తమను ఎవరూ ఏమి చేయలేరనే ధీమాతో తప్పులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీలోని హోటల్లో బిఎస్పికి చెందిన మాజీ ఎంపి కుమారుడు ఆశిష్ పాండే వీరంగం సృష్టించాడు. తుపాకీని చేతిలో పట్టుకొని ఓ యువతిని బెదిరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఢిల్లీలోని ఓ పైవ్ స్టార్‌ హోటల్లో జరిగిన పార్టీకి హాజరైన ఆశిష్ ఉన్నట్టుండి మహిళల వాష్ రూమ్‌ వైపు నడుస్తూ వెళ్ళాడు. అతన్ని గమనించిన ఓ మహిళ ఆపేందుకు ప్రయత్నించింది. దీంతో ఆశిష్ తిరిగి వెనిక్కి వేళ్ళిపోయాడు. తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిన పాండే ఆ మహిళను చూసి కోపోద్రిక్తుడై గన్‌తో బెదిరించాడు. ఈ విషయాన్ని గమనించిన అతని స్నేహితురాలు, సెక్యూరిటీ గార్డు పాండేను వారించి వెనక్కి తీసుకెళ్ళారు.ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు హోటల్ సీసీ కెమేరాలలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సామాజిక మాద్యమాలలో వైరల్ అవడంతో ఢిల్లీ పోలీసులు అతనిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసును నమోదు చేశారు. త్వరలోనే పాండే అరెస్టు చేయనున్నట్లు తెలిపారు.

nanireddy

nanireddy

Next Story