హోంమంత్రికి ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ క్షమాపణలు

హోంమంత్రికి ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ క్షమాపణలు
x
Highlights

రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గాంధీ క్షమాపణలు చెప్పారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫోరెన్సిక్‌...

రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గాంధీ క్షమాపణలు చెప్పారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రారంభానికి గురువారం హోంమంత్రికి ఆహ్వానం లభించని విషయం తెలిసిందే. దీనికి మనస్థాపం చెందిన హోంమంత్రి నిన్న విజయవాడలోనే ఉన్పప్పటికీ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీయగా అసలు విషయం తెలుసుకుని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం చినరాజప్పతో ఫోన్లో మాట్లాడారు. జరిగిన సంఘటనను తెలుసుకున్నానని, సాయంత్రం వచ్చి కలవాలని కోరారు. కాగా... జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, హోంమంత్రికి క్షమాపణ చెబుతున్నట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గాంధీ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories