logo
జాతీయం

దుంకా ట్రెజరీ కేసులో లాలూకు ఏడేళ్లు జైలు శిక్ష

దుంకా ట్రెజరీ కేసులో లాలూకు ఏడేళ్లు జైలు శిక్ష
X
Highlights

బీహార్ దాణాస్కాం నాలుగో కేసులో.. లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాదు.. 30 లక్షల జరిమానా...

బీహార్ దాణాస్కాం నాలుగో కేసులో.. లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాదు.. 30 లక్షల జరిమానా కూడా విధించింది కోర్టు. 3 కోట్ల 18 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగంలో లాలూకు ఈ శిక్ష పడింది. దాణా స్కాం కేసుల్లో.. ఇప్పటివరకు లాలూకు 20 ఏళ్ల 6 నెలల శిక్ష పడింది. ఇక.. ఇదే కేసులో బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాను కోర్టు నిర్దోషిగా తేల్చింది. దుంకా ట్రజరీ కేసులో రాంచీ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. దాణా కుంభకోణంలో ఇది నాలుగవ కేసు. ఈ స్కామ్‌లో 3.13 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగింది. డిసెంబర్ 1995 నుంచి 1996 వరకు దుంకా ట్రెజరీ నుంచి ఆ నిధులను స్వాహా చేశారు. 1990లో బీహార్ సీఎంగా ఉన్నప్పుడు లాలూ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. లాలూతో పాటు దాణా కుంభకోణం కేసులో మరో 31 మంది నిందితులుగా ఉన్నారు. బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా మాత్రం ఈ కేసులో నిర్ధోషిగా తేలారు. ఈ కేసులోనూ లాలూ దోషిగా తేలడంతో ఆయన ఇక ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు.

Next Story