విమాన, బస్‌ టికెట్లపై ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్‌

nanireddy
Updated on: 24 Dec 2018 4:38 PM IST
విమాన, బస్‌ టికెట్లపై ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్‌
X

క్రిస్‌మస్‌, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్‌' భారీ ఆఫర్లకు తెరతీసింది. బస్‌ టికెట్లపై 20 శాతం తగ్గింపును ప్రకటించింది. అలాగే దేశీయ విమానాలపై రూ 1000, అంతర్జాతీయ విమానాలపై 12 శాతం తగ్గింపును ఇస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. అంతేకాకుండా హోటల్‌ బుకింగ్స్‌పై 50 శాతం తగ్గింపు కూడా ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ తాజా ఆండ్రాయిడ్‌ యాప్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ల వినియోగం కోసం ఎలాంటి కూపన్‌ కోడ్‌ను వాడాల్సిన పనిలేదు. అన్ని డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో పాటు నెట్‌ బ్యాంకింగ్‌లోనూ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్‌ స్పష్టం చేసింది. ఇదిలావుంటే అంతర్జాతీయ విమాన టికెట్లను రూ 3239 లకే ఇండిగో ఆఫర్‌ చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఆఫర్ కు ఆదివారమే చివరి రోజు కావడం విశేషం.

nanireddy

nanireddy

Next Story