ఫ్లిప్ కార్ట్ లో సంచలన పరిణామం.. రాజీనామా చేసిన..

nanireddy
Updated on: 24 Dec 2018 3:59 PM IST
ఫ్లిప్ కార్ట్ లో సంచలన పరిణామం.. రాజీనామా చేసిన..
X

ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ గ్రూప్ సీఈఓగా వ్యవహరిస్తున్న బన్నీ బన్సాల్ తన పదవికి రాజీనామా చేశారు. అనుచిత ప్రవర్తన ఆరోపణల కారణంగా అయన రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డట్టు తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన అనుచిత ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా అవి శృతిమించడంతో ఏకంగా తన పదవికే రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా భారతదేశంలో ఆన్ లైన్ బిజినెస్ చేసే సంస్థల్లోఫ్లిప్ కార్ట్ ముందువరుసలో ఉంటుంది . పండగలు, వివిధ రూపాల్లో భారీ ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. కానీ ఇప్పుడు బన్నీ బన్సాల్ రాజీనామాతో సంస్థలో ఏం జరుగుతోందా అన్న ఆసక్తి ఉద్యోగులతోపాటు ప్రతిఒక్కరిలోనూ ఉంది.

nanireddy

nanireddy

Next Story