రేపటితో లాస్ట్.. సగం ధరకే ఆ రెండు స్మార్ట్ ఫోన్లు..

nanireddy
Updated on: 24 Dec 2018 3:48 PM IST
రేపటితో లాస్ట్.. సగం ధరకే ఆ రెండు స్మార్ట్ ఫోన్లు..
X

దివాలి సందర్బంగా ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు 'బిగ్‌ దివాలీ సేల్‌' ఆఫర్ ప్రకటించగా.. రేపటితో అది ముగియనుంది. ఈ ఆఫర్లో వివిధ రకాల వస్తువులు తగ్గింపు ధరలలో వస్తున్నాయి. అందులో ముఖ్యంగా శాంసంగ్‌ , హానర్‌ స్మార్ట్‌ఫోన్లపై ఏకంగా 50 శాతం తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌: 3జీబీ/64జీబీ వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 17,999 గా ఉండగా కేవలం రూ. 9,999కే లభిస్తుంది. అలాగే హానర్‌ (6జీబీ/128జీబీ) ఫోన్ కేవలం రూ.24,999 కే వస్తుంది. దీని అసలు ధర రూ.32,999 గా ఉంది. ఎస్‌బీఐ కార్డు కొనుగోలుపై 10శాతం డిస్కౌంట్‌ అదనంగా లభిస్తుంది అని ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. వీటితోపాటు నోకియా 5.1‍ ప్లస్‌, మోటో, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు కూడా డిస్కౌంట్‌ ధరల్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి.

nanireddy

nanireddy

Next Story