ఎవరైనా ఏటీఎమ్‌ దోచుకుందామని చూస్తారు..వీరు మాత్రం...

ఎవరైనా ఏటీఎమ్‌ దోచుకుందామని చూస్తారు..వీరు మాత్రం...
x
Highlights

దొంగతనం వృత్తిలో ఉన్నవారికి ఏటీఎమ్‌ దోచుకోవడం ఒక సవాల్‌. ఏటీఎమ్‌లు పగలగొట్టి అందులో ఉన్న సొమ్ము దోచుకోవాలనుకుంటారు. కానీ అది ఎలానూ సాధ్యం కాదని, కొంత...

దొంగతనం వృత్తిలో ఉన్నవారికి ఏటీఎమ్‌ దోచుకోవడం ఒక సవాల్‌. ఏటీఎమ్‌లు పగలగొట్టి అందులో ఉన్న సొమ్ము దోచుకోవాలనుకుంటారు. కానీ అది ఎలానూ సాధ్యం కాదని, కొంత మంది ఏటీఎమ్‌ల్లోని ఏసీలపై కన్నేశారు. మరో ఇరవై ఏటీఎమ్‌లు దోచుకొని ఉంటే సెంచరీ కొట్టి ఉండేవారు. బ్యాడ్‌ లక్‌ పోలీసులకు దొరికిపోయారు.

ఇక్కడ కనిపిస్తు్న ఈ ఐదుగురు ఇంటర్, డిగ్రీ చదువుతూ దొంగతనలకు పాల్పడుతూ జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ ముఠాకు ఎలక్ట్రిషిన్ గా పనిచేస్తున్న మహమ్మద్ అహసన్ రహమాన్ నాయకత్వం వహించి నగరంలోని ఎటిఎంలను కేంద్రంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎలక్ట్రిషిన్ గా పనిచేస్తున్న రహమాన్ నగరంలోని ఎటిఎంలలోకి వెళ్ళి ఎసీ చెడిపోయిందని సెక్యురిటీ గార్డ్ ను నమ్మించి వాటిని తీసుకుని వెళతాడు. గత నెల రోజులుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకోండ కమీషనరేట్ పరిధుల్లో దాదాపు 80 ఎటిఎంలలో ఎసీలను దొంగలించారు. రహమాన్ తనతో పాటు నలుగురు యువకులను కలుపుకుని ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తూర్పు మండల డిసీపీ సి.శశిధర్ రాజు తెలిపారు. నిందితుల నుంచి డెబ్బై అయిదు ఏసీలను, రెండు టూ వీలర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories