ప్రాణాలు తీసిన పొగమంచు...రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

ప్రాణాలు తీసిన పొగమంచు...రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతి
x
Highlights

జాతీయ రహదారులు రక్తపుటేరులుగా మారాయి. ఏపీలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచు కారణంగా జరిగిన...

జాతీయ రహదారులు రక్తపుటేరులుగా మారాయి. ఏపీలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు విగతజీవులుగా మారగా మరికొంతమంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఫిరంగిపురం మండలం తాళ్ళూరు వాసులుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

ఇటు దాచేపల్లి మండలం శాంతినగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలిలోనే ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులు తెనాలికి చెందిన బేతపూడి పరంజ్యోతి, తిప్పిన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పొగమంచు కమ్మేయడంతో ఎదురుగా ఉన్న వాహనం కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories