హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం

హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం
x
Highlights

హైదరాబాద్ కొత్తగూడలో ఉన్న షా గౌస్ హోటల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మధ్యాహ్నం...

హైదరాబాద్ కొత్తగూడలో ఉన్న షా గౌస్ హోటల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మధ్యాహ్నం సమయం కావడంతో కస్టమర్లు,హోటల్ సిబ్బందితో కిక్కిరిసి ఉంది. ఆ సమయంలో కిచెన్ నుంచి భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పెళ్లి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కిచెన్ లో ఉన్న మహిళలకు మంటలు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలు అదుపు చేసాయి. అప్పటికే మరో సిలిండర్ గ్యాస్ లీకు కావడంతో ఫైర్ సిబ్బందు అదుపు చేశారు. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి శ్రీధర్ రెడ్డి చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories