ఇంట్లో దెయ్యం ?

x
Highlights

నిప్పు లేకుండానే మంటలొస్తాయా? ఒక్కసారి కాదు ఒక్క రోజు కాదు మూడు నెలలుగా మిస్టరీ మంటలు ఓ గ్రామాన్ని వణికిస్తున్నాయి. మూడిళ్లలో మూడు నెలలుగా మంటలు...

నిప్పు లేకుండానే మంటలొస్తాయా? ఒక్కసారి కాదు ఒక్క రోజు కాదు మూడు నెలలుగా మిస్టరీ మంటలు ఓ గ్రామాన్ని వణికిస్తున్నాయి. మూడిళ్లలో మూడు నెలలుగా మంటలు చెలరేగుతున్నాయి. మంటల వెనుక మిస్టరీ అర్థంకాక బాధిత కుటుంబసభ్యులు భయాందోళన చెందుతున్నారు. ఇది దెయ్యం పనిగా కొందరు చెబుతున్నారు.

అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం చెన్నరాయినిపల్లి గ్రామం. ఈ ఊరిలో ఒకే కుటుంబానికి చెందిన తిరుపాల్, శేఖర్, చెన్ను అనే ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. వీరంతా ఒకే చోట ఇళ్లు కట్టుకుని వేర్వేరుగా జీవిస్తున్నారు. మూడు నెలల క్రితం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో తిరుపాల్ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి బట్టలు కాలిపోయాయి. దీన్ని ప్రమాదవశాత్తుగా భావించారు. తిరుపాల్ ఇంట్లో తర్వాత అతడి ఇద్దరు సోదరులు శేఖర్ , చెన్ను ఇళ్లలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే బట్టలు, పిల్లల పుస్తకాలు కాలి బూడిదయ్యాయి. చివరకు బీరువాలో పెట్టిన కొత్త వస్త్రాలు, నగదు కాలిపోయాయి.

గత మూడు నెలల నుంచి రెండు మూడు రోజులకోసారి ఉదయం, సాయంత్రం ఈ ముగ్గురు సోదరుల ఇళ్లలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగుతున్నాయి. నిత్యావసర వస్తువులు, బట్టలు కాలిపోతున్నాయి. మంటలను నీళ్లు చల్లి ఆర్పేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పంట సాగు కోసం రెండున్నర లక్షల రూపాయలు తెచ్చి బీరువాలో భద్రపరిచారు. రాత్రికి రాత్రి ఉన్నట్టుండి బీరువాలో మంటలు చెలరేగి నగదుతో పాటు విలువైన బట్టలు కాలి బూడిదయ్యాయి. దీంతో తమ ఇంట్లో దయ్యం తిరుగుతోందని బాధిత కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ముగ్గురు సోదరుల ఇళ్లల్లో ఉన్నట్టుండి మంటలు రావడంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సర్పంచ్ తో కలిసి స్వయంగా పరిశీలనకు వెళ్లారు. తమ కళ్లెదుటే మంటలు చెలరేగడంతో ఖంగుతిన్నారు. ఇది దెయ్యం పనే అని జారుకున్నారు. మంటల వెనుక గల కారణామేమిటో కనిపెడతామంటున్నారు అధికారులు. మంటలు ఎలా వస్తున్నాయో తెలుసుకునేందుకు గ్రామ సర్పంచ్‌తో పాటు పలువురు స్ధానికులు తిరుపాల్, శేఖర్, చెన్ను ఇళ్లలో ఉండగానే కళ్లెదుట మంటలు చెలరేగడంతో షాక్ తిన్నారు. ఇళ్లు ఖాళీ చేయమంటూ చెప్పి వెళ్లిపోయారు. వారం క్రితం పెద్ద సోదరుడు తిరుపాల్ కుమార్తె పాఠశాలకు వెళ్లగా అక్కడ బాలికకు మంటలు అంటుకున్నాయి. దీంతో బడికి కూడా ఇంటికి దగ్గరే ఉండాల్సి వస్తోందని బాలిక ఆవేదన వ్యక్తం చేస్తోంది.

మంటల కారణంగా ఇంట్లో కాలు పెట్టాలంటేనే భయపడాల్సి వస్తోందని బాధితులు అంటున్నారు. మూడు నెలలుగా కంటిమీద కునుకు కరువయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగిలేదంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ముగ్గురు సోదరుల ఇళ్లలో చెలరేగుతున్న మంటలు దెయ్యం పనిగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబీకులు స్థానిక ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పై అధికారులకు సమాచారమిచ్చిన ఎమ్మార్వో మంటల వెనుక ఉన్న గుట్టును రట్టు చేస్తామంటున్నారు.

అనంతపురం జిల్లాలో ఓ ఇంట్లో మంటలు చెలరేగుతున్న మంటలు దెయ్యం పని కాదని జనవిజ్ఞాన వేదిక నాయకుడు రమేష్ స్పష్టం చేస్తున్నారు. ఇది పక్కాగ గిట్టనివారు చేస్తున్న పని అని ఆరోపిస్తున్నారు. జనంలోని మూఢనమ్మకాలను ఆసరాగా తీసుకుని మంత్రాగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. తమ ఇళ్లలో మంటలకు దెయ్యం కారణం లేదా మరేదో కారణం ఉందా అనే విషయాన్ని తేల్చి తమను కాపాడాలని బాధిత కుటుంబం వేడుకుంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories