అబిడ్స్‌ హైస్కూల్‌లో అగ్ని ప్రమాదం

nanireddy
Updated on: 24 Dec 2018 3:39 PM IST
అబిడ్స్‌ హైస్కూల్‌లో అగ్ని ప్రమాదం
X

అబిడ్స్‌లోని అల్సెన్స్‌ హైస్కూల్‌లో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ ఆవరణలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మధ్యాహ్నం ఒంటిగంట సమయంలోజరిగినట్టు తెలుస్తోంది. పాఠశాలలోని పరేడ్‌ స్టేజ్‌ క్రింద ఉన్న గది నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ వెలువడింది. ఈ సమయంలో స్కూల్‌ ఆవరణలో దాదాపు 2 వేల మంది విద్యార్థులు ఉన్నారు. కానీ దట్టమైన పోగ రావడం వల్ల ఏడుగురు విద్యార్థులు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. వీరిని పాఠశాల యాజమాన్యం స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుంది. కాగా విషయం తెలుసుకున్న అగ్రిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. కాగా విద్యార్థులేవరికి ఏమి కాలేదని.. దట్టమైన పోగ వల్ల కొందరు విద్యార్థులు ఇబ్బందికి గురయ్యారు యాజమాన్యం చెబుతోంది.

nanireddy

nanireddy

Next Story