5 ఆర్టీసీ బస్సులు దగ్ధం

x
Highlights

వరంగల్‌ వన్ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున డిపోలో మంటలు రావడాన్ని గుర్తించిన సిబ్బంది .. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమిచ్చారు....

వరంగల్‌ వన్ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున డిపోలో మంటలు రావడాన్ని గుర్తించిన సిబ్బంది .. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. గ్యారేజీ ఆవరణలోని ఆర్టీసీ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. తొలుత ఓ బస్సులో చెలరేగిన మంటలు పక్కనున్న బస్సులకు వ్యాపించడంతో ఐదు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలిసిన వెంటనే రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి డిపో అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ చెప్పారు. ఐదు బస్సులు పూర్తిగా కాలిపోయాయన్నారు. రాజధాని బస్సును సూపర్ లగ్జరీ బస్సుగా మార్చే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందని సోమారపు సత్యనారాయణ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories