రాజమండ్రిలో ఘోర అగ్ని ప్రమాదం ..మంటల్లో కాలిబూడిదైన 65 ఇళ్లు ..

రాజమండ్రిలో ఘోర అగ్ని ప్రమాదం ..మంటల్లో కాలిబూడిదైన 65 ఇళ్లు ..
x
Highlights

తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజమండ్రి రూరల్‌ కొంతమూరులో అగ్నిప్రమాదానికి 65కుపైగా పూరిళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్‌ షార్ట్‌...

తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజమండ్రి రూరల్‌ కొంతమూరులో అగ్నిప్రమాదానికి 65కుపైగా పూరిళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదంతో సర్వం కోల్పోయి బాధితులు రోడ్డునపడ్డారు. ఇదే కాలనీలో రెండేళ్ల క్రితం అగ్నిప్రమాదం జరిగి పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో ప్రమాదం జరగడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదం కారణంగా కట్టుబట్టలతో మిగిలామని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories