మేమేమి చేశాము నేరం..

మేమేమి చేశాము నేరం..
x
Highlights

భార్యా భర్తల మధ్య గొడవలు చిన్న పిల్లల ప్రాణాలు తీసేస్తున్నాయి నిండు నూరేళ్లూ బతకాల్సిన పిల్లలు అమ్మా, నాన్న గొడవల్లో అర్ధాయుష్కులైపోతున్నారు తాజాగా...

భార్యా భర్తల మధ్య గొడవలు చిన్న పిల్లల ప్రాణాలు తీసేస్తున్నాయి నిండు నూరేళ్లూ బతకాల్సిన పిల్లలు అమ్మా, నాన్న గొడవల్లో అర్ధాయుష్కులైపోతున్నారు తాజాగా చందానగర్ ట్రిపుల్ మర్డర్ లో ఓచిన్నారి బలవడం విచారకరం. భార్యా, భర్తల మధ్య గొడవలతో పిల్లలు అన్యాయమై పోతున్నారు. నిండు నూరేళ్లూ బతకాల్సిన పిల్లలు కాస్తా అర్ధాంతరంగా చనిపోతున్నారు అమ్మా, నాన్నల ప్రేమను పొందాల్సిన చిన్నారులు వారి చేతుల్లోనే కిరాతకంగా చనిపోతున్నారు ప్రేమే తప్ప ద్వేషం తెలియని పసి పిల్లలపై కన్నవారికి కనికరం అన్నది లేకుండా పోతోంది. క్షణికావేశం, ఆస్తిగొడవలు, అక్రమ సంబంధాలు ప్రేమ వైఫల్యాలు ఈ కారణాలకే కుటుంబ బంధాలు తెగిపోతున్నాయి సమాజంలో కుటుంబ బంధం చిన్న బోతోంది.

భార్యా, భర్తా గొడవ పడితే పిల్లలు దెబ్బ తినాల్సిందేనా? తమ మధ్య గొడవలు పిల్లల దాకా తీసుకెళ్లారాదన్న భావన కానీ, పిల్లల ప్రాణాల కన్నా తమ గొడవలు ఎక్కువ కాదన్న భావన కానీ నేటి తల్లి దండ్రుల్లో ఉండటం లేదు నేను నాది అన్న అహంకారం పెరిగి కుటుంబాన్ని కాలదన్నే పరిస్థితికి దారి తీస్తోంది.

సాధారణంగా పిల్లలు స్వేచ్ఛగా, పూర్ణయుష్కులుగా బతకాలని తల్లి దండ్రులు కోరుకుంటారు కానీ ఇక్కడ కన్న తండ్రే బిడ్డ ప్రాణం తీసేశాడు.. తల్లి, తండ్రి మధ్య వివాదాలు ఆ చిన్నారికి తెలియవు..తెలిసినదల్లా అమ్మా, నాన్నల ప్రేమ పొందాలన్న తపనే హైదరాబాద్ చందానగర్లో కుటుంబ కలహాలు ఓ చిన్నారి నిండుప్రాణాన్ని బలి తీసుకున్నాయి అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన ఈ చిన్నారిని కన్న తండ్రే దారుణంగా కుటుంబ కలహాలకు బలి చేసేశాడు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన అపర్ణ కుకట్ పల్లికి చెందిన మధును ప్రేమించి పెళ్లి చేసుకుంది వారిద్దరికీ నాలుగేళ్ల చిన్నారి కూడా ఉంది కుటుంబ కలహాలకు ఈ చిన్నారి బలికావడం ఇప్పుడు అందరినీ కలచి వేస్తోంది. భార్యా భర్తా ఏం గొడవలు పడ్డారో తెలీదుకానీ బెడ్ రూమ్ లో చిన్నారి పడుకున్నది పడుకున్నట్లే చనిపోయి కనిపించింది. భార్యతో మనస్పర్ధలొస్తే విడాకులు తీసుకోవచ్చు ఇద్దరూ విడి విడిగా ఎవరి దారిన వారు బతకొచ్చు కానీ ఈ సంఘటనలో భార్యను, అత్తను, పసి పిల్లను సైతం నిర్దాక్షిణ్యంగా హత్య చేసేశారు.

three members of family  murdered in hyderabad - Sakshi

పెద్దల మధ్య గొడవకు పిల్లలు బలికావాలా? పెద్ద వారు గొడవ పడితే పిల్లలకు ఆయుష్షు తీరినట్లేనా? ఇలాటి ఘర్షణలు తలెత్తినప్పుడు అయితే హత్య లేకపోతే ఆత్మ హత్య ఇవే పరిష్కారంగా అడుగులేస్తుండటం కలవరపరుస్తోంది. మానవ సంబంధాలు మలినమైపోతున్నాయి ఆస్తిగొడవలు, వివాహేతర సంబంధాలు, అనుమానాలు, కోప తాపాలు కారణమేదైనా ముందు చిన్న పిల్లలే బలిపశువులవుతున్నారు.

కొన్నాళ్ల క్రితం విజయవాడలో ఆస్తి కోసం జరిగిన గొడవ ఓ చిన్నారి ప్రాణాలు తీసేసింది. కేన్సర్ బాధితురాలైన చిన్నారి వైద్యం కోసం కన్న తండ్రిని అర్ధించి అర్ధించి చివరకు ప్రాణాలు కోల్పోయింది తనను బతికించమని వైద్యం చేయించమనీ ఆచిన్నారి వాట్సప్ మెసేజ్ లు, వీడియో సందేశాలతో వేడుకుంది కానీ ఆ తండ్రి మనసు కరగలేదు చిన్నారికే చెందిన ఆస్తిని ఆమెకు ఇచ్చేందుకు సైతం ఆ తండ్రి నిరాకరించాడు భార్యపై ఉన్న కసితో కడుపున పుట్టిన బిడ్డను నిర్లక్ష్యం చేశాడు. క్షణ క్షణం మృత్యువు దరి చేరడంతో చివరకు ఆ చిన్నారి కన్ను మూసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories