మరో పరువు హత్య వెలుగులోకి

nanireddy
Updated on: 28 Dec 2018 12:13 PM IST
మరో పరువు హత్య వెలుగులోకి
X

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య మరవకముందే మంచిర్యాల జిల్లాలో మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. కులాంతర వివాహం చేసుకుందని కూతురిని దారుణంగా హతమార్చాడు ఆమె తండ్రి సత్యనారాయణ. జిన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన పిండి అనురాథ ఈ నెల మూడో తేదిన అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే అంతకుముందు వారి వివాహానికి అనురాధ తండ్రి అడ్డుచెప్పడంతో వారు ఆర్యసమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇది అనురాధ తండ్రికి నచ్చలేదు. కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఆమెను హతమార్చాలని పధకం పన్నాడు. తండ్రి గురించి తెలిసిన అనురాధ తన భర్తను తీసుకుని హైదరాబాద్ వెళ్ళింది. అక్కడ 18 రోజుల ఉన్న తరువాత గొడవలు సద్దుమణిగాయి అని అనుకుని అత్తారింటికి వచ్చారు. ఈ క్రమంలో కూతురిని అత్తారింటినుంచి కొట్టుకుంటూ తీసుకెళ్లి హత్య చేశాడు సత్యనారాయణ. లక్ష్మణ్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలావుంటే జరగబోయే దారుణాన్ని పెళ్లికి ముందే అంచనా వేసింది అనురాథ. తన కుటుంబసబ్యుల నుంచే తనకు ప్రాణహాని ఉందని ఓ సెల్ఫీ వీడియోలో చెప్పింది.

nanireddy

nanireddy

Next Story