భార్య మీద కోపంతో.. ఐదేళ్ల చిన్నారిని కొట్టి చంపిన కన్నతండ్రి

భార్య మీద కోపంతో.. ఐదేళ్ల చిన్నారిని కొట్టి చంపిన కన్నతండ్రి
x
Highlights

భార్య మీద కోపంతో.. కన్నబిడ్డనే కాటికి పంపాడో తండ్రి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కొత్తగూడెం సెంటర్‌ దగ్గర.. మధ్యం తాగిన తండ్రి రవితేజ 5 యేళ్ల సొంత...

భార్య మీద కోపంతో.. కన్నబిడ్డనే కాటికి పంపాడో తండ్రి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కొత్తగూడెం సెంటర్‌ దగ్గర.. మధ్యం తాగిన తండ్రి రవితేజ 5 యేళ్ల సొంత కూతురు రుబీనాపైనే దాడికి దిగాడు. తీవ్ర గాయాలైన రుబీనాను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు కోల్పోయింది. గత కొంత కాలంగా రవితేజకు తన భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో రవితేజపై ఏలూరు వన్ టౌన్‌లో కేసు కూడా నమోదైంది. అదే కోపంతో బిడ్డపై దాడి చేసినట్లు స్థానికుల సమాచారంతో వెలుగులోకొచ్చింది. అయితే కూతురిని గాయపర్చిన రవితేజ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories