హ‌లో అన్న కూతురు..కొట్టిచంపిన క‌సాయి తండ్రి

హ‌లో అన్న కూతురు..కొట్టిచంపిన క‌సాయి తండ్రి
x
Highlights

క్ష‌ణికావేశంలో ఓ క‌సాయి తండ్రి క‌న్న‌కూతుర్నిహ‌త్య‌చేశాడు. అ త‌రువాత త‌న‌కేం తెలియ‌దు అన్న‌ట్లు నాట‌క‌మాడాడు. విజ‌య‌వాడ అజిత్ సింగ్ నగర్ లో నివాసముండే...

క్ష‌ణికావేశంలో ఓ క‌సాయి తండ్రి క‌న్న‌కూతుర్నిహ‌త్య‌చేశాడు. అ త‌రువాత త‌న‌కేం తెలియ‌దు అన్న‌ట్లు నాట‌క‌మాడాడు. విజ‌య‌వాడ అజిత్ సింగ్ నగర్ లో నివాసముండే రమణ కూతురు కృష్ణ‌వేణి (15) ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతుంది. చ‌దువుల్లో ముందుడే కృష్ణ‌వేణి తెలివైన విద్యార్ధి. అన్నీ పరీక్ష‌ల్లో తోటి విద్యార్ధులతో పోటీప‌డుతు మొదటి రాంక్ సాధించేది. అయితే డిసెంబ‌ర్ 30న తన తండ్రిసెల్ ఫోన్ లో గేమ్ ఆడుతుండా ఓ రాంగ్ కాల్ వ‌చ్చింది. ఆ కాల్ లిఫ్ట్ చేసిన కృష్ణ‌వేణికి అవ‌త‌లి నుంచి మాట‌లు విన‌క‌పోవ‌డంతో హ‌లో హ‌లో అంటూ ఫోన్ పెట్టేసింది. అయితే కూతురు ఫోన్ మాట్లాడ‌డం గ‌మ‌నించిన తండ్రి ర‌మ‌ణ ఆగ్ర‌హ‌వేశానికి లోన‌య్యాడు. ఫోన్ లో ఎవ‌రితో మాట్లాడుతున్నావంటూ నీల‌దీశాడు. దీంతో తాను ఎవ‌రితో మాట్లాడ‌లేద‌ని రాంగ్ నెంబ‌ర్ అని చెప్పింది. అయినా ప‌ట్టించుకోకుండా కూతురిపై అనుమానంతో చావ‌బాదాడు. కూతురు త‌ప్పులేదంటూ అడ్డువ‌చ్చిన భార్య‌ను కొట్టాడు.

అయితే కొద్దిసేప‌టి త‌రువాత మ‌ద్యం సేవించి ఉన్న ర‌మ‌ణ మ‌రోసారి కూతురిపై చేయిచేసుకున్నాడు. దీంతో తండ్రి దెబ్బ‌ల‌కు తాళ‌లేక కృష్ణ‌వేణి అక్క‌డికక్క‌డే క‌న్నుమూసింది. ఈ హ‌త్య‌కేసు త‌న‌పై వ‌స్తుంద‌నే భ‌యంతో కూతురు క‌డుపునొప్పి వ‌చ్చి చ‌నిపోయింద‌ని స్థానికుల్ని న‌మ్మించాడు. కానీ మ‌ద్యంమ‌త్తులో ఉన్న ర‌మ‌ణ కూతుర్ని హ‌త్య చేసి ఉంటార‌ని భావించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు స్థానికులు. సమాచారంతో సంఘ‌ట‌న‌స్థలానికి చేరుకున్న పోలీసులు ర‌మ‌ణ‌ని విచారించారు. దీంతో తానే కూతుర్ని కొట్ట‌డంతో చ‌నిపోయింద‌ని ఒప్పుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories