ఇన్‌కం ట్యాక్స్ అధికారులమంటూ భారీ మోసం...ఓ రైస్ మిల్లు వ్యాపారిని...

ఇన్‌కం ట్యాక్స్ అధికారులమంటూ భారీ మోసం...ఓ రైస్ మిల్లు వ్యాపారిని...
x
Highlights

తూర్పుగోదావరి జిల్లాలో సినీ ఫక్కీలో మోసం జరిగింది. రాజోలు మండలం కూనవరంలో ఐదుగురు వ్యక్తులు ఇన్‌కం ట్యాక్స్ అధికారులమంటూ వచ్చి ఓ వ్యాపారి వద్ద 12లక్షల...

తూర్పుగోదావరి జిల్లాలో సినీ ఫక్కీలో మోసం జరిగింది. రాజోలు మండలం కూనవరంలో ఐదుగురు వ్యక్తులు ఇన్‌కం ట్యాక్స్ అధికారులమంటూ వచ్చి ఓ వ్యాపారి వద్ద 12లక్షల నగదు, విలువైన డాక్యుమెంట్లు తీసుకుని పరారయ్యారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూనవరం గ్రామంలో రుద్ర రామకృష్ణారావుకు చెందిన శ్రీ వెంకటేశ్వర బాయిల్డ్ రైస్ మిల్లుకు వచ్చిన నకిలీ ఇన్‌కం ట్యాక్స్ అధికారులు వ్యాపారిని బెదిరించారు. డాక్యుమెంట్లు, లాకర్లు రెండు గంటలసేపు తనిఖీ చేసి, లాకర్‌లో ఉన్న 12లక్షల నగదు, విలువైన డాక్యుమెంట్లు తీసుకెళ్లారు. అయితే, ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన వ్యాపారి రాజోలు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఘటనలపై ఆరా తీసిన పోలీసులు వచ్చిన వాళ్లు నకిలీ అధికారులుగా తేల్చారు. సినీ ఫక్కీలో కారులో వచ్చిన వ్యక్తులు డాక్యుమెంట్లు, నగదు పట్టుకుపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories