పుత్ర సంతానానికి నిమ్మకాయ మందు...రోగం ఏదైనా బురిడిబాబాను దర్శిస్తే మాయం

పుత్ర సంతానానికి నిమ్మకాయ మందు...రోగం ఏదైనా బురిడిబాబాను దర్శిస్తే మాయం
x
Highlights

నిమ్మకాయలతో సంతానం కల్గిస్తాను...మీకు పట్టిన దయ్యం...భూతం వదిలిస్తానంటూ మాయమాటలతో అమాయకులను బురిడీకొట్టిస్తున్నాడు మరో నకిలీబాబా. చేతబడులు నయం...

నిమ్మకాయలతో సంతానం కల్గిస్తాను...మీకు పట్టిన దయ్యం...భూతం వదిలిస్తానంటూ మాయమాటలతో అమాయకులను బురిడీకొట్టిస్తున్నాడు మరో నకిలీబాబా. చేతబడులు నయం చేస్తానంటూ అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్న దొంగబాబ భాగోతం వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.

పచ్చని దోతి...ఎడమ చేతిలో కత్తి...కుడిచేతిలో నెమలీకల దండ...ఎదురుగా రోగం నయం చేయమని వచ్చిన జనం....ఇదీ వికారాబాద్ జిల్లా ఎన్కపల్లి గ్రామంలో ఓ బురిడీ బాబా బాగోతం. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం ఎంకేపల్లిలోని శ్రీమల్లిఖార్జునస్వామి ఆలయాన్ని వేదిక చేసుకొని ప్రతి ఆదివారం అమావాస్య పౌర్ణమీ రోజుల్లో తనకు దేవుడు ఆవహిస్తున్నాడని పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడు. అమాయక ప్రజలకు మాయ మాటలు చెప్పి తమ భక్తులుగా మార్చుకుంటున్నాడు.

భక్తుల నమ్మకాన్ని ఆసరా చేసుకొని డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఆలయానికి వచ్చే భక్తులు బాబాను దర్శనం చేసుకోవాలంటూ 20 రూపాయల టోకెన్ తీసుకోవాలని కౌంటర్ తెరిపించాడు. బాబాను దర్శించుకుంటే మీరు కోరుకున్న కోరికలు తీరుతాయంటూ ప్రచారం చేయడంతో భక్తులు వచ్చి తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. చేతిలో కత్తి నెమలి ఈకలతో కూడిన కట్టతో భక్తుల వీపుపై కొడుతూ బాధలు తొలగిపోతాయంటూ నమ్మ బలుకుతున్నాడు. మీకు శని పట్టింది. నాగదోశం ఉందంటూ భయపెడుతూ భక్తుల నుంచి అందినకాడికి డబ్బుల్ని గుంజుతున్నాడు.

మరో వైపు దళితులకు దేవాలయంలోకి అనుమతిలేదంటూ బయట నుంచే సమస్యలు చెప్పుకోవాలంటునడంతో ఓ మహిళ తనకు సంతానం కలుగడంలేదంటూ బాబా ముందు తన గోడు చెప్పుకుంది. బాబా వ్యవహారం బయటకు పొక్కడంతో పూజల పేరుతో ఎలాంటి డబ్బులు తీసుకోవడం లేదని భక్తులు ఇచ్చే డబ్బును ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకే ఖర్చు చేస్తున్నానని చెబుతున్నాడు. మాయ మాటలతో బురిడికొట్టిస్తున్నా ప్రజలు అలాంటి వారినే నమ్ముతుండటంతో నకిలీ బాబాల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఇలాంటి బాబాల ఆటకట్టించి జనంలో అవగాహన కల్పించాలని కోరుతున్నారు స్థానికులు.

Show Full Article
Print Article
Next Story
More Stories