చెన్నంపల్లి కోటలో కొనసాగుతున్న గుప్త నిధుల వేట

చెన్నంపల్లి కోటలో కొనసాగుతున్న గుప్త నిధుల వేట
x
Highlights

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం వేట కొనసాగుతోంది. 5 రోజులుగా అధికారులు తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ జరిపిన...

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం వేట కొనసాగుతోంది. 5 రోజులుగా అధికారులు తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ జరిపిన తవ్వకాల్లో ఇనుప ఖనిజాలు, ఎముక బయటపడ్డాయి.

2007లో కాళేశ్వరం బాబా ఇక్కడకు వచ్చి చెన్నంపల్లి కోటలో వజ్ర, వైఢూర్యాలు ఉన్నాయని చెప్పారు. దీంతో చాలా మంది రహస్యంగా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపి విఫలమయ్యారు. 5 రోజుల క్రితం అడ్వకేట్ రవికిరణ్ రాజ్ కోటలో గుప్తనిధులు తవ్వడానికి అధికారులతో కలిసి ఇక్కడికి వచ్చారు. తవ్వకాలకు అధికారికంగా అనుమతి లేదని తెలియడంతో గ్రామస్తులు వందల సంఖ్యలో కోటపైకి చేరుకున్నారు. దీంతో స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆర్డీఓ ఓబులేసు, ఎమ్మార్వో గోపాల్ రావ్ తవ్వకానికి వచ్చిన సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.

తర్వాత స్థానిక సీఐ విక్రమ సింహా గ్రామస్తులతో మాట్లాడారు. ఒకవేళ గుప్తనిధులు నిజంగానే బయటపడితే అందులో గ్రామ అభివృద్ధి కోసం 33 శాతం వాటా ఇచ్చేలా ఒప్పుకున్నారు. దీంతో 12 మంది గ్రామస్తులతో ఒక కమిటీ వేశారు. వారి ముందే గుప్తనిధుల తవ్వకాలు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories