తిరుపతిలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

తిరుపతిలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
x
Highlights

తిరుపతిలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలవడం రాజకీయంగా...

తిరుపతిలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు, అధినేత చంద్రబాబు పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. గతంలో వైసీపీలో చేరతారని ప్రచారం జరగ్గా, అనూహ్యంగా ఆయన హైదరాబాద్ జనసేన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. పవన్‌తో దాదాపు గంటసేపు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. విజయదశమి నాటికి పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories