ప్రణయ్‌ ఇంటి చుట్టూ తిరుగుతున్న..

నల్లగొండ జిల్లాలో ప్రణయ్ పరువు హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రణయ్ ఇంటికి వచ్చిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Arun Chilukuri
Published on: 29 Dec 2018 12:44 PM IST
amrutha
X
amrutha

నల్లగొండ జిల్లాలో ప్రణయ్ పరువు హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రణయ్ ఇంటికి వచ్చిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని కార్తీక్ టెక్స్ టైల్ దుకాణం నడుపుతున్న వినోద్ కుమార్ అనే వ్యక్తి ఇటీవలి కాలంలో ప్రణయ్ ఇంటికి ఏదో సాకు చెప్పి తరచుగా వస్తున్నాడు. ఈ క్రమంలో అతడిపై అనుమానం వచ్చిన ప్రణయ్‌ కుటుంబ సభ్యులు అతడి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా ప్రణయ్‌ భార్య అమృత తల్లితో మాట్లాడినట్లు అతడిసెల్‌లో ఉంది. వారి ప్రోద్బలంతోనే వినోద్‌కుమార్‌ తమ ఇంటికి వస్తున్నాడని గుర్తించి అతడిపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం అమృత తమ అత్తతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో వినోద్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, విచారణ తరువాత పూర్తి వివరాలను త్వరలోనే వెళ్లడిస్తామని సీఐ సదానాగరాజు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story