టీడీపీలోకి కడప కీలక నేత..!

nanireddy
Updated on: 24 Dec 2018 4:16 PM IST
టీడీపీలోకి కడప కీలక నేత..!
X

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్ కు ఎదురు దెబ్బలు ఆగేలా లేవు. గత ఆరునెలల్లోనే అరడజను మంది మాజీ మంత్రులు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పగా.. తాజాగా మరో నేత టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఆయనే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి అహ్మదుల్లా. ఇవాళ(మంగళవారం) ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారాయన. టీడీపీలో చేరే అంశంపై అహ్మదుల్లా సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే సీఎంను తాను మర్యాదపూర్వకంగానే కలిశానని అహ్మదుల్లా చెబుతున్నారు. పోతు పోతు కడప జిల్లాలో టీడీపీ బాగా పుంజుకుందని అన్నారు. కార్యకర్తలతో చర్చించే టీడీపీలో చేరే అంశంపై తర్వలో నిర్ణయం తీసుకుంటానని అహ్మదుల్లా స్పష్టం చేశారు.

nanireddy

nanireddy

Next Story