కలకలం రేపుతున్న వసంత నాగేశ్వరరావు ఫోన్ సంభాషణ

x
Highlights

మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, గుంటుపల్లి ఈవో నరసింహరావుతో జరిపిన ఫోన్ సంభాషణ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మైలవరం నియోజకవర్గంలో బ్యానర్ల విషయంపై...

మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, గుంటుపల్లి ఈవో నరసింహరావుతో జరిపిన ఫోన్ సంభాషణ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మైలవరం నియోజకవర్గంలో బ్యానర్ల విషయంపై మాట్లాడటానికి ఫోన్ చేసిన నాగేశ్వరరావు ఈవోతో బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. మైలవరంలో రాజకీయాల గురించి వసంత నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనను ఫోన్‌లో బెదిరించారంటూ కృష్ణాజిల్లా గుంటుపల్లి గ్రామకార్యదర్శి ఎన్‌. వెంకట నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటుపల్లి వైసీపీ బ్యానర్ల తొలగింపు వ్యవహారంపై నాగేశ్వరరావు ఫోన్‌ చేసి బెదిరించారని ఫిర్యాదులో తెలిపారు. గుంటుపల్లి ఈవో నరసింహారావుతో ఫోన్లో మాట్లాడిన వసంత నాగేశ్వరరావు మనవాళ్లతో జాగ్రత్తగా ఉండమంటూ ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు.

మైలవరంలో మంత్రి దేవినేని ఉమాను ఓడించడమే తన కుమారుడు, వైసీపీ నేత కృష్ణప్రసాద్ లక్ష్యమని వసంత నాగేశ్వరరావు అన్నారు. ఇందుకు జగన్‌ కూడా పూర్తి మద్దతు పలుకుతున్నారని నాగేశ్వరరావు వివరించారు. గుంటుపల్లి గ్రామకార్యదర్శి ఎన్‌. వెంకట నరసింహారావుతో జరిగిపిన ఫోన్ సంభాషణలో చివరిగా వసంత నాగేశ్వరరావు నువ్వు ఎక్కడ ఉంటున్నావ్‌ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు జాగ్రత్త అంటూ ముగించారు. వసంత నాగేశ్వరరావు మాటలను బట్టి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని నరసింహారావు పోలీసులకు చేసిన ఫిర్యాదులో చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories