logo
జాతీయం

భారీ ఎన్‌కౌంటర్‌..మావోయిస్టు కీలకనేత హతం!

భారీ ఎన్‌కౌంటర్‌..మావోయిస్టు కీలకనేత హతం!
X
Highlights

ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రాద్రి జిల్లా చర్ల సమీపంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య...

ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రాద్రి జిల్లా చర్ల సమీపంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వారిని భద్రాచలం తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ, ఛత్తీస్ గఢ్ బోర్డర్ లోని అడవిలో మరోసారి అలజడి మొదలైంది. తెల్లవారుజామున రెండు రాష్ట్రాల పోలీసులు జాయింట్ ఆరేషన్ నిర్వహించినట్టు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హరిభూషణ్ తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మృతిచెందగా.. పోలీసుల్లో ఒకరు గాయపడ్డాడు. ఘటనా స్థలంలో ఏకే 47తో పాటు పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాల్పుల్లో చనిపోయిన వారిని పోస్టుమార్టమ్ కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.

Next Story