పంచాయతీ ఎన్నికలు జూన్‌లో

పంచాయతీ ఎన్నికలు జూన్‌లో
x
Highlights

ప్రభుత్వం కొత్త పంచాయితీ చట్టం మేరుకు ఎన్నికలు జరపించాలని భావిస్తూన్నా అచరణ సాద్యం అయ్యోల కనపడంలేదు. దీంతో పంచాయితీ ఏన్నికలు అలస్యం కానున్నాయి....

ప్రభుత్వం కొత్త పంచాయితీ చట్టం మేరుకు ఎన్నికలు జరపించాలని భావిస్తూన్నా అచరణ సాద్యం అయ్యోల కనపడంలేదు. దీంతో పంచాయితీ ఏన్నికలు అలస్యం కానున్నాయి. అంతేకాక కొత్త పంచాయితీల జాబితా గవర్నర్ నుంచి కమీషన్ కు చేరిన తర్వాత పంచాయితీలు, వార్డుల వారిగా ఓటర్ల జాబితాను సిద్దంచేయాల్సి ఉండంతో ఎన్నికల ఆలస్యం కానున్నాయి. దీంతో పాత పంచాయితీల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నిక సంఘం స్పష్టం చేయ్యడంతో పంచాయితీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేవని తెలుస్తోంది.

సర్పంచ్ ల పదవి కాలం ముగుస్తున్నందున జులై 30 లోపు పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట ఎన్నికల కమీషన్ కసరత్తులు మొదలు పెట్టింది. అందులో భాగంగా రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసింది. ప్రతి ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితా వల్ల వివాదాలు తలెత్తుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఓటర్లు గల్లంతు కావడం, వార్డులు మారడం వంటి సమస్యలు ఎన్నికల కమీషన్ ను ఇబ్బందుల పాలు చేస్తోంది. వాస్తవంగా ఓటర్ల నమోదు కార్యక్రమం రాష్ట ఎన్నికల కమీషన్ పరిధిలో లేదు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమీషన్ సిద్దం చేసిన ఓటర్ల జాబితానే రాష్ట ఎన్నికల కమీషన్ ప్రమాణికంగా తీసుకుంటుంది. అసెంబ్లీ ఓటర్ల లిస్టును గ్రామాలు, వార్డుల వారిగా విభజించి జాబితాను ప్రకటిస్తోంది. ఈ జాబితలో ఏమైన పోరపాట్లు ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి తప్పులను సరిదిద్దుకోవచ్చు. అయినా చివరి సమయంలో ఓట్లు గల్లంతు కావడం సర్వ సాధారణంగా మారింది. అందుకే ఇలాంటి పోరపాట్లు జరక్కుండా ఉండేందుకు రాజకీయ పార్టీలతో మంగళవారం నాడు రాష్ట ఎన్నికల కమీషన్ సమావేశమైంది.

ఈ సందర్భంగా ఎన్ని పంచాయితీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారని రాజకీయ పార్టీలు ఎన్నికల కమీషన్ ను ప్రశ్నించాయి. అయితే 1994 పంచాయిత్ రాజ్ చట్టం ప్రకారం 8,686 పంచాయితీలకు ఎన్నికలు నిర్వహిస్తామని కమీషన్ సమాధనమివవ్వడంతో పార్టీలు షాక్ అయ్యాయి. తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం, 2018 ని తీసుకొచ్చిన ప్రభుత్వం 12, 741 పంచాయితీలను ఏర్పాటు చేసింది. అయితే ఈ చట్టానికి గవర్నర్ అమోదం ఇంకా తెలపకపోవడంతో చట్టం రాష్ట ఎన్నికల కమీషన్ కార్యలయానికి చేరలేదు. దీంతో పాత పంచాయితీల ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు కమీషన్ కసరత్తులు చేపట్టడాన్ని పార్టీలు తప్పు బట్టాయి.

అయితే ఇప్పటికి కొత్త పంచాయితీల జాబితా ఎన్నికల కమీషన్ కు చేరకపోవడంతో ఎన్నికలు సకాలంలో జరుగుతాయో లేదో ననే అనుమానాలువ్యక్తమవుతున్నాయి. కొత్త జాబితా వచ్చాకా ఎన్నికల కోసం ఎన్నో ప్రక్రియలు జరగాలి. కొత్త జాబితా వచ్చాకా..కొత్త పంచాయితీలు, వార్డుల వారిగా ఓటర్ల విభజన జరగాలి. వాటిపై అభ్యంతరాలు పరిష్కారమైన అనంతరం పంచాయితీలు, వార్డుల వారిగా కులాల వారిగా ఓటర్ల లెక్కింపు జరగాలి. అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలి. ఇదంతా సూధీర్ఘ ప్రక్రీయ కావడంతో జులై 30 లోపు ఎన్నికలు జరగడం కష్టమేనని పలు పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. పంచాయితీల గడువు ముగిసేందుకు మరో 100 రోజుల సమయమే ఉంది. ఈ వంద రోజుల్లో అన్ని సమస్యలను అధిగమించి ఎన్నికలు నిర్వహించడం కమీషన్ కు కత్తిమీద సాముగా మారనుంది. దీంతో పంచాయితీ ఎన్నికలపై సకాలంలో జరుగుతాయాలేవా అనేది ప్రశ్నర్ధకంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories