పార్టీకి ఈసీ 10 నిమిషాలు...

పార్టీకి ఈసీ 10 నిమిషాలు...
x
Highlights

మూడు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ బృందం.. హైదరాబాద్‌ హోటల్‌ తాజ్‌కృష్ణకు చేరుకుంది. కాసేపట్లో గుర్తింపు పొందిన 9 రాజకీయ...

మూడు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ బృందం.. హైదరాబాద్‌ హోటల్‌ తాజ్‌కృష్ణకు చేరుకుంది. కాసేపట్లో గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీల నేతలతో ఈసీ బృందం భేటీకానుంది. ఈ సమావేశంలో ఒక్కో రాజకీయ పార్టీకి 10 నిమిషాల సమయం కేటాయించారు. అనంతరం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌, పోలీస్‌ నోడల్‌ అధికారులతో సీఈసీ టీమ్ భేటీకానుంది. రేపు ఉదయం 10 గంటలకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, డీఐజీ, ఐజీలతో భేటీ ఉంటుంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు డీఈవోలు, ఎస్పీలతో ప్రత్యేకంగా బృంద సభ్యులు సమావేశమవుతారు. 24న ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ల డీజీలతో, 11.15 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో సమావేశమై... అదే రోజు సాయంత్రం తిరిగి ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories