సుజనా చుట్టూ ఈడీ ఉచ్చు...లుకౌట్ నోటీసులు...?

సుజనా చుట్టూ ఈడీ ఉచ్చు...లుకౌట్ నోటీసులు...?
x
Highlights

మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఈడీ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన విదేశాలకు వెళ్లకుండా నోటీసులు ఇచ్చిన ఈడీ బృందం సుజనాకు చెందిన పలు...

మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఈడీ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన విదేశాలకు వెళ్లకుండా నోటీసులు ఇచ్చిన ఈడీ బృందం సుజనాకు చెందిన పలు లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సుజానా గ్రూప్‌కు చెందిన నాగార్జున హిల్స్‌లో ఈడీ అధికారులు అర్ధరాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని స్ల్పెండిడ్ మెటల్ ప్రొడక్ట్ లిమిటెడ్, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ కంపెనీలతోపాటు జూబ్లీహిల్స్‌లోని సుజనా నివాసంలో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 304కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.

సెంట్రల్ బ్యాంకు నుంచి 124 కోట్లు, ఆంధ్రాబ్యాంకు నుంచి 60కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు నుంచి 120కోట్లు సుజనా గ్రూప్స్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాస్ కల్యాణ్‌రావు పేరుతో రుణాలు తీసుకున్నట్టు తేలింది. అయితే, సుజనా గ్రూప్స్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన శ్రీనివాస్ కల్యాణ్‌రావు సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కొడుకు. ఆయనపై బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2016లో సీబీఐ కేసు నమోదైంది. తాజాగా మార్షియస్ కమర్షియల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులకు పలు కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. దీంతో వాటిని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories