గులభీదళ సభ వేళ, సమావేశమేలా?

గులభీదళ సభ వేళ, సమావేశమేలా?
x
Highlights

ప్రగతి నివేదన గులభీదళ సభ వేళ గంట ముందే ప్రత్యెక సమావేశ మేలా? కేబినెట్‌ భేటీ నిర్వహించుకొని అలా, బహిరంగ సభకి బయలుదేరుతారట యిలా, ఎన్నో వార్తలకి ఇక...

ప్రగతి నివేదన గులభీదళ సభ వేళ

గంట ముందే ప్రత్యెక సమావేశ మేలా?

కేబినెట్‌ భేటీ నిర్వహించుకొని అలా,

బహిరంగ సభకి బయలుదేరుతారట యిలా,

ఎన్నో వార్తలకి ఇక ఇది ఒక మేళ. శ్రీ.కో


ప్రగతి నివేదన సభకు ఒక రోజు ముందు లేదా ఒక రోజు తరువాత కేబినెట్‌ భేటీ నిర్వహించుకునే అవకాశం ఉన్నా బహిరంగ సభ ప్రారంభానికి గంట ముందే ఈ సమావేశం జరగనుండటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపడంతోపాటు అసెంబ్లీని రద్దు చేస్తూ తీర్మానం చేయవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories