రికార్డ్ సృష్టించిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ విద్యార్థులు

రికార్డ్ సృష్టించిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ విద్యార్థులు
x
Highlights

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ విద్యార్థులు.. దేశ రాజధాని ఢిల్లీ యూనివర్సిటీలో సత్తా చాటారు. సత్తా మాత్రమే కాదు.. రికార్డ్ సృష్టించారు....

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ విద్యార్థులు.. దేశ రాజధాని ఢిల్లీ యూనివర్సిటీలో సత్తా చాటారు. సత్తా మాత్రమే కాదు.. రికార్డ్ సృష్టించారు. 10 కాదు.. 20 కాదు.. 80 మంది విద్యార్థులు.. డైరెక్ట్‌గా ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్స్ సంపాదించారు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా. ఈసారి.. తెలంగాణ పేరు మారుమోగేలా చరిత్ర సృష్టించారు మన గురుకుల స్టూడెంట్స్.

తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల నుంచి 94 మంది స్టూడెంట్స్.. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో అడ్మిషన్స్‌కు అప్లై చేశారు. అందులో ఫస్ట్ లిస్ట్‌లోనే 80 మందికి అడ్మిషన్స్ దొరికాయి. ఇదే ఓ రికార్డ్ ఐతే.. దీనిని మించింది మరొకటుంది. వీళ్లంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్. కానీ.. వీళ్లు అడ్మిషన్స్ సంపాదించింది మాత్రం.. జనరల్ కోటాలో. అందుకే.. ఈ న్యూస్ ఇప్పుడు సెన్సేషన్ అయ్యింది.

వీళ్లందరికీ.. అప్లై చేసినంత ఈజీగా అడ్మిషన్లు దొరకలేదు. ఒక్కొకరూ.. 94 శాతం మార్కులతో.. టాప్ లేపి.. టాప్ లిస్ట్‌లో అడ్మిషన్లు సాధించారు. గతేడాది.. కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో అడ్మిషన్లు సంపాదించారు. ఈసారి.. ఆ నెంబర్.. డబుల్, ట్రిపుల్‌ను మించి పోయింది. ఈ స్టూడెంట్స్ అంతా.. పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే. మొత్తం 94 మంది అప్లై చేస్తే.. ఫస్ట్ లిస్ట్‌లో 84 మందికి అడ్మిషన్లు వచ్చాయి. ఇంకా సెకండ్ లిస్ట్ వచ్చేసరికి.. మిగిలిన 14 మందికి కూడా అడ్మిషన్లు దక్కే అవకాశం ఉంది.

ఈ 80 మంది విద్యార్థులు.. రాంజాస్, హిందూ, హన్స్ రాజ్, లేడీ శ్రీరామ్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందారు. ఈ టాప్ కాలేజీలన్నీ.. ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తుంటాయి. వీటిల్లో సీట్లు రావడం అంత ఈజీయేం కాదు. అయినా.. తెలంగాణ గురుకుల విద్యార్థులు.. చాలా సింపుల్‌గా సాధించారు.

ఢిల్లీ యూనివర్సీటీలో అడ్మిషన్లు సాధించిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు.. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాగా చదివి.. తమ తల్లిదండ్రులు, గురువులు కన్న కలలు సాకారం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పట్టుదలను.. ఇకపై కొనసాగించి.. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదుగుతామని చెప్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ కాలేజీల్లో వచ్చిన అడ్మిషన్లతో బాగా చదివి.. మంచిపేరు తీసుకొస్తామని చెప్తున్నారు.

వీళ్లే కాదు.. కొంతకాలంగా తెలంగాణలో గురుకుల విద్యార్థులు ప్రభంజనం సృష్టిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ విద్యార్థులను మించి చదువుల్లో తమ ప్రతిభ చాటుతున్నారు. జాతీయస్థాయి పోటీ పరీక్షల్లోనూ.. మన గురుకుల స్టూడెంట్స్.. రికార్డ్ సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో ఏకంగా.. 80 మంది ఫస్ట్ కటాఫ్‌లోనే అడ్మిషన్లు సాధించి.. రికార్డ్ తిరగరాశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories