Top
logo

లేడీస్ హాస్టల్ ముందు మందుబాబుల వీరంగం

లేడీస్ హాస్టల్ ముందు మందుబాబుల వీరంగం
X
Highlights

హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లో ఆకతాయిలు వీరంగం సృష‌్టించారు. గత అర్ధరాత్రి మద్యం తాగి రచ్చ రచ్చ చేశారు. నూతన...

హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లో ఆకతాయిలు వీరంగం సృష‌్టించారు. గత అర్ధరాత్రి మద్యం తాగి రచ్చ రచ్చ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా రోడ్లపై వచ్చిన పోకిరీలు లేడిస్ హాస్టల్స్ పై రాళ్లు విసిరారు. లేడిస్ హాస్టల్స్ నుంచి అమ్మాయిలు బయటకు రావాలంటూ గట్టిగా అరిచారు. మరికొందరు వాహనాలు కిందకు పడేశారు. పోకిరీల హంగామాను స్థానికులు సెల్ ఫోన్ ద్వారా వీడియో తీశారు. దాదాపు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు అందుబాటులో లేకపోవడంతో అక్కడికి చేరుకోవడానికి సమయం పట్టింది. ఈలోగా ఆకతాయిలను అక్కడి స్థానికుల చెదరగొట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆకతాయిల వీరంగాన్ని స్థానికులు వీడియో తీశారు. వీటి సహాయంతో పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

Next Story