మద్యం మత్తులో రెచ్చిపోయిన హోంగార్డ్

x
Highlights

నెల్లూరు జిల్లాలో ఓ హోంగార్డు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. ఫూటుగా మద్యం సేవించి కానిస్టేబుల్‌నంటూ ఓ వ్యక్తిని చితక్కొట్టేశాడు. బాధితుడు కాళ్లు...

నెల్లూరు జిల్లాలో ఓ హోంగార్డు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. ఫూటుగా మద్యం సేవించి కానిస్టేబుల్‌నంటూ ఓ వ్యక్తిని చితక్కొట్టేశాడు. బాధితుడు కాళ్లు పట్టుకున్నా వదల్లేదు. బండ బూతులు తిడుతూ బస్టాండ్‌లో పరిగెత్తించి కొట్టాడు. దూరదర్శన్‌లో హోంగార్డ్‌‌గా పని చేస్తున్న నరేశ్‌ అల్లూరు నుంచి నెల్లూరు వస్తుండగా బస్సులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీన్ని ప్రశ్నించిన ఓ వ్యక్తిని నా జోలికి వస్తావా ? నేను కానిస్టేబుల్‌నంటూ బూతు పురాణం అందుకున్నాడు. బస్టాండ్‌లోని షాపులోకి సదరు వ్యక్తి వెళ్లడంతో వెంటపడి కొట్టాడు. కాళ్లు పట్టుకోమని చితక్కొట్టాడు. బాధితుడు కాళ్లు పట్టుకున్నా వదిలిపెట్టలేదు. పోలీసులు రంగంలోకి దిగి హోంగార్డును అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories