రావోయి మా ఇంటికి మావో!

రావోయి మా ఇంటికి మావో!
x
Highlights

అప్పట్లో... దొంగరాముడు చిత్రం (1955) వచ్చిన ఒక పాట...అందరి పెదాలపై ఆడేది..అది.. రావోయి మా ఇంటికి మావో అనే పాట....ఈ పాట సంగీతం పెండ్యాల నాగేశ్వర రావు,...

అప్పట్లో... దొంగరాముడు చిత్రం (1955) వచ్చిన ఒక పాట...అందరి పెదాలపై ఆడేది..అది.. రావోయి మా ఇంటికి మావో అనే పాట....ఈ పాట సంగీతం పెండ్యాల నాగేశ్వర రావు, రచన సముద్రాల రాఘవాచార్య, గొప్పగా గానం చేసింది... జిక్కి.
రావోయి మా ఇంటికి

రావోయి మా ఇంటికి మావో

మాటున్నది మంచి మాటున్నది

మాటున్నది మంచి మాటున్నది

నువ్వు నిలిసుంటె నిమ్మ సెట్టు నీడున్నది

నువ్వు కూసుంటె కురిసీలో పీటున్నది

నువ్వు తొంగుంటె పట్టె మంచం పరుపున్నది

మాటున్నది మంచి మాటున్నది

రావోయి మా ఇంటికి మావో మాటున్నది

ఆకలైతే సన్నబియ్యం కూడున్నది

నీకాకలైతే సన్నబియ్యం కూడున్నది

అందులోకి అరకోడి కూరున్నది

అందులోకి అరకోడి కూరున్నది

ఆపైన రొయ్యపొట్టు చారున్నది

మాటున్నది మంచి మాటున్నది

రావోయి మా ఇంటికి మావో

మాటున్నది మంచి మాటున్నది!!రావోయి!!

రంజైన మీగడ పెరుగున్నది

నంజుకోను ఆవకాయ ముక్కున్నది

నీకు రోగమొస్తే ఘాటైన మందున్నది

రోగమొస్తే ఘాటైన మందున్నది

నిన్ను సాగనంప వల్లకాటి దిబ్బున్నది!!రావోయి!!
అప్పట్లో ఈ పాట మాస్ ని క్లాసు ని కూడా ఉపేసిన పాట. శ్రీ.కో

Show Full Article
Print Article
Next Story
More Stories