దిగులు చెందుతున్న రమణదీక్షితులు పెంపుడు కుక్కలు

x
Highlights

విశ్వాసానికి ప్రతీకలు కుక్కలు. యజమానుల పట్ల అమితమైన ప్రేమను కనబరుస్తాయి. రెండురోజులు కనిపించకపోతే తల్లడిల్లిపోతుంటాయి. తిండి తినకుండా దిగాలుగా పడి...

విశ్వాసానికి ప్రతీకలు కుక్కలు. యజమానుల పట్ల అమితమైన ప్రేమను కనబరుస్తాయి. రెండురోజులు కనిపించకపోతే తల్లడిల్లిపోతుంటాయి. తిండి తినకుండా దిగాలుగా పడి ఉంటాయి. ఇప్పుడు తిరుమలలో శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడి ఇంటి కుక్కల పరిస్థితి అలాగే ఉంది. ఆయన ఇంటి వద్ద సరిగ్గా ఉండకుండా బయట ప్రాంతాలకు వెళ్తుండటంతో ఆయన పెంపుడు కుక్కలు దిగులు చెందుతున్నాయి.

టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు తన పదవికి కోల్పోయాక తరచూ చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు తిరుగుతూ బిజీబిజీగా ఉంటున్నారు. ఇంటి వద్ద ఎక్కువ సేపు ఉండటం లేదు. దీంతో ఆయన కనిపించక ఇంటి వద్ద ఉన్న పెంపుడు కుక్కలు దిగులు చెందుతున్నాయి. ఆయన ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాయి.

రమణదీక్షితులు సహజంగానే పక్షి, జంతు ప్రేమికుడు. ఆయన తన ఇంట్లో రెండు శునకాలతో పాటు పెద్ద సంఖ్యలో రామచిలుకలు, పిచ్చుకలను పెంచుతున్నారు. దీంతో ఆయన ఇల్లంతా పక్షుల కిలకిల రావాలతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. అయితే, రమణదీక్షితులు అందుబాటులో లేకపోవడంతో వాటి ఆలనా, పాలనా పనివాళ్లే చూసుకుంటున్నారు.

అయితే, తిరుమలలో కుక్కలు పెంచడం నిషేధం. ఎక్కడైనా కుక్క కనిపిస్తే దేవస్థానం ఆరోగ్య విభాగం సిబ్బంది వెంటనే తిరుపతికి తరలిస్తుంటుంది. అలాంటికి రమణదీక్షితులు కుక్కలు పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ కుక్కలను పెంచుతున్న ఆయన వాటిని కొండపైకి ఎలా తీసుకెళ్లారని రమణదీక్షితులు వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories