Top
logo

దమ్ములేకనే.. కేసులు పెడుతున్నారు : డీకే అరుణ

X
Highlights

తెలంగాణ ఆపధర్మ సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్ నేతలపై దాడులు చేయిస్తున్నారని సీనియర్ నేత డీకే అరుణ ఆరోపించారు. ఐటీ...

తెలంగాణ ఆపధర్మ సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్ నేతలపై దాడులు చేయిస్తున్నారని సీనియర్ నేత డీకే అరుణ ఆరోపించారు. ఐటీ దాడులు జరుగుతున్న రేవంత్ రెడ్డి నివాసానికి ఈ ఉదయం చేరుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతూ ఉండటంతో కాంగ్రెస్ నేతలపై దాడులు చేయిస్తున్నారంటూ అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఇదే తరహాలో ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటూ టీఆర్ఎస్‌ నేతలను హెచ్చరించారు. రాజకీయంగా రేవంత్‌ను ఎదుర్కొనే దమ్ము లేకనే కేసులు పేరుతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని టీఆర్‌ఎస్‌ నాయకులపై మండిపడ్డారు.

Next Story