logo
సినిమా

బ్రేకింగ్ : జీవితంలో చేయడనుకున్న పని చేసేసిన రామ్ గోపాల్ వర్మ

బ్రేకింగ్ : జీవితంలో చేయడనుకున్న పని చేసేసిన రామ్ గోపాల్ వర్మ
X
Highlights

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితంలో చేయడనుకున్న పని చేసేశాడు. దాంతో వర్మ చేసిన పనికి అర్ధంకాక...

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితంలో చేయడనుకున్న పని చేసేశాడు. దాంతో వర్మ చేసిన పనికి అర్ధంకాక అభిమానులు జుట్టుపీక్కుంటున్నారు. గతంలో తనకు దేవుడంటే నమ్మకం లేదని.. దేవుడిపైనే వివాదాస్పద ట్వీట్లు చేసిన అయన.. ఇవాళ తిరుమల వెంకన్నను దర్శించడం విశేషం. వివాదాల వర్మ శ్రీవారి దర్శనానికి….. ఎందుకు వెళ్లాడనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. పబ్లిసిటీ కోసం వెళ్లాడా….. లేక నిజంగానే దేవుడిమీద నమ్మకంతో వెళ్లాడా అన్నవిషయం అర్ధం కావడం లేదు. కొందరేమో వర్మ తన పబ్లిసిటీ కోసం దేవుడిని కూడా వాడేసుకుంటున్నాడు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాణిపాకం దర్శించుకున్న ఆర్జీవీ ఇవాళ తిరుమల దర్శనం వెనుక…. పబ్లిసిటీ లెక్కలున్నట్లు చర్చ జరుగుతుంది కాగా ఈ సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివరాలను చెప్పనున్నారు వర్మ.

Next Story