Top
logo

తాట తీస్తాం : లంచం అడిగితే ఈ నెంబర్ కు ఫోన్ చేయండి

తాట తీస్తాం : లంచం అడిగితే ఈ నెంబర్ కు ఫోన్ చేయండి
X
Highlights

అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లంచం అడిగితే వెంటనే 1064...

అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లంచం అడిగితే వెంటనే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి ప్రజలకు సూచించారు. లంచం అడిగే ఉద్యోగుల సమాచారం ఇచ్చిన వ్యక్తులు, సంస్థల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. లంచం అడగటం, ఇవ్వటం, తీసుకోవటం నేరంగా వెల్లడించారు. 1064 టోల్ ఫ్రీ నెంబర్ అని.. ప్రజల్లో అవగాహన కోసం విస్త్రృతంగా ప్రచారం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. లంచం ఇవ్వకుండా.. కంప్లయింట్ చేసినప్పుడు న్యాయం జరుగుతుందన్నారు. అప్పుడే అవినీతి నిరోధక శాఖ సమర్ధవంతంగా పని చేస్తుందన్నారు. ప్రజలు అందరూ కూడా అవినీతిరహిత సమాజం కోసం తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలన్నారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా.. ఎక్కడ జరుగుతున్నా.. మీ దృష్టికి వస్తే వెంటనే 1064 నెంబర్ కు కాల్ చేసి చెప్పాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం అని భరోసా ఇచ్చారు ఆఫీసర్..

Next Story