డీఎస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌

x
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితి తనపై కక్ష కట్టిందంటున్నారు డీఎస్‌. ఈ మేరకు పార్టీ అధిష్ఠానికి బహిరంగ లేఖ రాశారు. తాను పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే పార్టీ నుంచి...

తెలంగాణ రాష్ట్ర సమితి తనపై కక్ష కట్టిందంటున్నారు డీఎస్‌. ఈ మేరకు పార్టీ అధిష్ఠానికి బహిరంగ లేఖ రాశారు. తాను పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేఖలో కోరారు. తాను పార్టీని వదిలితే కవిత చేసిన ఆరోపణలు నిజమవుతాయని చెప్పారు. తనంతట తానుగా పార్టీకి రాజీనామా చేయనని దయచేసి సస్పెండ్ చేయాలని లేఖ రాశారు.

తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశానో పార్టీ చెప్పాలన్నారు రాజ్యసభ సభ్యుడు డీఎస్‌. తానెప్పుడు బీజేపీకి అనుకూలంగా మాట్లాడానో చెప్పాలన్నారాయన. మనసులో ఏదో పెట్టుకొని నిరాధారమైన ఆరోపణలు చేసి రాజకీయంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లేని పోనివి కల్పించుకొని సంజయ్‌పై కేసు పెట్టి కుటుంబాన్ని రోడ్డుకు ఇడ్చారన్నారు.

టీఆర్‌ఎస్ పార్టీ తనపై కక్ష కట్టిందంటున్నారు డీఎస్‌. తనపై వచ్చిన ఆరోపణలపై డీఎస్ స్పందిస్తూ టీఆర్ఎస్‌కు బహిరంగ లేఖ రాశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డానన్న ఆరోపణలు బాధ కలిగించాయన్నారు. తాను ఎలాంటి తప్పు చేయకున్నా సస్పెండ్ చేయాలని సీఎం కేసీఆర్‌కు తీర్మానం పంపారని తెలిపారు. తాను టీఆర్‌ఎస్‌లో ఉండటం కవితకు, జిల్లా నేతలకు ఇష్టం లేకపోతే సస్పెండ్ చేయండని సస్పెండ్ చేయడం చేతకాకపోతే తీర్మానం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్‌ను వేధింపులకు గురిచేయడం సరికాదంటున్నారు డీఎస్ వర్గీయులు.

రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌పై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ కాంగ్రెస్ నాయకులతో బేరసారాలు జరిపారంటూ ఆరోపించారు. పార్టీకి డీఎస్ చీడపురుగుగా మారడం వల్లే జిల్లా నేతలంతా బహిష్కరించాలంటూ డిమాండ్ చేశామన్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని కాపాడుకునేందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతున్నారంటూ విమర్శించారు.

తన కుమారుడు అరవింద్ బీజేపీలో చేరతాడని కేసీఆర్‌కు ముందే చెప్పానని, బీజేపీలోకి వెళ్లాలని తన అనుచరులకు ఎప్పుడూ చెప్పలేదని లేఖలో తెలిపారు. సంజయ్ విషయంలో ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించిందని వ్యాఖ్యానించారు. సంజయ్‌ని అక్రమంగా అరెస్ట్‌ చేశారన్నారు డీఎస్‌. గులాబీదళంలో డీఎస్ వ్యవహారం మాత్రం కాస్త అలజడి సృష్టించందంటున్నారు కార్యకర్తలు.

Show Full Article
Print Article
Next Story
More Stories