డిప్యూటీ చైర్మన్ ఎన్నిక: కేసీఆర్, జగన్ కీలకం...

x
Highlights

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా కురియన్ పదవీకాలం ముగిసింది. మరి తర్వాతి డిప్యూటీ ఛైర్మన్ ఎవరు.? ఇప్పుడిదే సస్పెన్స్‌గా మారింది. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికను...

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా కురియన్ పదవీకాలం ముగిసింది. మరి తర్వాతి డిప్యూటీ ఛైర్మన్ ఎవరు.? ఇప్పుడిదే సస్పెన్స్‌గా మారింది. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికను ఏకగ్రీవం చేద్దామని ఉపరాష్ట్రపతి వెంకయ్య చెప్పినా సీన్ అందుకు భిన్నంగా ఉంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డిప్యూటీ ఛైర్మన్ సీటును దక్కించుకోవడానికి అధికార, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ గెలిచేందుకు ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ లేదు. దీంతో దాదాపు 26 ఏళ్ల తర్వాత డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రెండు రోజుల్లోనే డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికను పూర్తి చేసే అవకాశం ఉంది. రాజ్యసభలో మొత్తం సీట్లు 245. బిహార్‌ నుంచి ఖాళీ అయిన స్థానం ఇంకా భర్తీ కాలేదు. అంటే, రాజ్యసభ సంఖ్యా బలం 244. డిప్యూటీ చైర్మన్‌ పదవిని కైవసం చేసుకోవడానికి 123 ఓట్లు అవసరం. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలకు 119 ఎంపీల మద్దతుండగా పీడీపీతో పొత్తు తెగిపోయిన తర్వాత బీజేపీకి, దాని మిత్రపక్షాలకు కలిపి 108 ఎంపీల బలం ఉంది. బీజేపీకి 76 మంది మిత్రపక్షాలు, స్వతంత్రులు కలిస్తే 108 మంది సభ్యుల మద్దతు లభిస్తోంది. దీంతో 4 నామినేటెడ్‌ పదవుల భర్తీపై బీజేపీ దృష్టి సారించింది. 4 ఖాళీలనూ భర్తీ చేసినా డిప్యూటీ చైర్మన్‌ పదవిని కైవసం చేసుకోవడానికి ఎన్డీయేకు సంఖ్యా బలం సరిపోదు.

కాంగ్రెస్‌ విషయానికొస్తే నామినేటెడ్‌తో కలిసి 52 మంది సభ్యులుండగా తృణమూల్‌, బీఎస్పీ, ఎస్పీ, వామపక్షాలు, స్వతంత్రులు, చిన్నాచితక పార్టీలతో కలిస్తే ప్రతిపక్షాల సంఖ్యా బలం 119 వరకూ పెరుగుతుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో.. ప్రాంతీయ పార్టీలైన టీఆర్‌ఎస్‌, వైసీపీ, బీజేడీల మద్దతు కీలకంగా మారింది. రాజ్యసభలో టీఆర్ఎస్‌కు ఆరుగురు, వైసీపీకి ఇద్దరు, బిజు జనతాదళ్‌కు 9 మంది సభ్యుల బలం ఉంది. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక నాటికి వీరిలో ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories