ఢిల్లీ డెత్ మిస్టరీలో సంచలన ట్విస్ట్... ఆ ఇంట్లో 11 పైపులు..

ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించటం దేశరాజధానిలో సంచలనం సృష్టించింది. క్షుద్ర పూజల...
ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించటం దేశరాజధానిలో సంచలనం సృష్టించింది. క్షుద్ర పూజల ప్రభావానికి లోనయి మోక్షం కోసం వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంతా భావిస్తున్నారు. అయితే ఈ కేసులో బంధువుల మాత్రం కొత్త వాదనను వినిపిస్తున్నారు. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వారికి లేదని, ఖచ్ఛితంగా ఎవరో వారిని చంపి వేలాడదీసి ఉంటారని అనుమానిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. వీరంతా ముందుగానే ప్లాన్ చేసుకుని సామూహిక ఆత్మహత్యలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో లభించిన నోట్స్‌ల ఆధారంగా ఈ ఘోరానికి క్షుద్ర పూజలే అనుమానిస్తుండగా... దీన్ని బలపరుస్తూ మరో కీలక విషయాన్ని అధికారులు వెలుగులోకి తెచ్చారు.
ఆ ఇంట్లో అనుమానాస్పదంగా పెట్టి ఉంచిన 11 పైపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృత దేహాలు వేలాడుతున్న తీరుకు, పైపులు పెట్టిన స్థానాలకు సరిగ్గా సరిపోలుతుండడం మరింత అనుమానం రేపుతోంది. అందులో నాలుగు పైపులు పెద్దవిగా, మిగతావి చిన్నగా ఉండడంతో... ఆ నాలుగు పైపులు మగవాళ్లను, మిగతావి మహిళలను సూచించడానికే పెట్టారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఒక పైపు దూరంగా పెట్టి ఉంచడంతో... ఈ పైపుకి, మిగతా మృతదేహాలకు దూరంగా ఫ్లోర్‌పై కనిపించిన వృద్దురాలి మృతదేహానికి సంబంధం ఉందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బురారీ ఇంట్లో ఓ లేఖ దొరికింది ఈ లేఖను పోలీసులు డీకోడింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద 11 గొట్టాలు అసాధారణ పద్దతిలో అమర్చారు. ఆ పైపులు అమర్చిన తీరు, మృతదేహాలు వేలాడిన తీరు ఒకేలా ఉన్నాయి. దీంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయేముందు చేతులు, కాళ్లు ఎలా కట్టుకోవాలనే అంశాన్ని కూడ లేకలో రాసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ లేఖను డీకోడింగ్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఎలా చనిపోవాలనే విషయమై ఈ లేఖలో చర్చించారు. కళ్లకు ఎలా గంతలు కట్టుకోవాలనే విషయమై కూడ రాసి ఉంది. చనిపోవడానికి వారం రోజుల ముందు నిష్టగా పూజలు నిర్వహించాలని కూడ ఉంది. ఒకవేళ ఆత్మ ప్రవేశిస్తే మరుసటి రోజే పనిని పూర్తి చేయాలని కూడ రాశారు. నోటికి కట్టిన బట్టను గట్టిగా కట్టుకోవాలని కూడ సూచించారు. ఎవరు ఎంత కఠినంగా దీక్షను పూర్తి చేస్తే మోక్షం అంతే స్థాయిలో ఉంటుందని కూడ ఆ లేఖలో ఉంది. అయితే 11 మంది మృత్యువాత పడితే అందులో ఆరుగురు ఊపిరాడక మరణించారని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది.
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMT
ఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMTHealth Tips: ఇవి తింటే మీ పని అంతే.. ఎంత నష్టం జరుగుతుందంటే..?
10 Aug 2022 3:30 PM GMTమోహన్ బాబుని ట్రోల్ చేస్తున్న సాయిబాబా భక్తులు
10 Aug 2022 3:15 PM GMT