చంద్రబాబు సభలో దీపక్‌రెడ్డి కలకలం

చంద్రబాబు సభలో దీపక్‌రెడ్డి కలకలం
x
Highlights

తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండైన టీడీపీ నేత చంద్రబాబు సభలో ప్రత్యక్షం కావడం ఆసక్తికరంగా మారింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు...

తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండైన టీడీపీ నేత చంద్రబాబు సభలో ప్రత్యక్షం కావడం ఆసక్తికరంగా మారింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన జన్మభూమి-మా ఊరు ముగింపు సభకు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హాజరయ్యారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడైన దీపక్‌రెడ్డిని భూకబ్జా కేసుల్లో హైదరాబాద్‌ పోలీసులు గతేడాది జూన్‌లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని అన్నివైపుల నుంచి ఒత్తిడి వచ్చింది. పార్టీ పరువు కాపాడుకునేందుకు దీపక్‌రెడ్డిని టీడీపీ నుంచి చంద్రబాబు సస్పెండ్‌ చేశారు. మళ్లీ ఆయనతో ఈరోజు సీఎం చంద్రబాబు సభా వేదిక పంచుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories