ఏజెన్సీలో అమ్మాయిల మిస్సింగ్‌ కలకలం

x
Highlights

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో...అమ్మాయిల మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. ఎక్కడికి వెళుతున్నారో తెలీదు. ఎవరు అమ్మాయిలను తీసుకెళ్తున్నారో...

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో...అమ్మాయిల మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. ఎక్కడికి వెళుతున్నారో తెలీదు. ఎవరు అమ్మాయిలను తీసుకెళ్తున్నారో అంతుచిక్కడం లేదు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని అమ్మాయిలు...బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. గ్రామాల్లో వరుసగా అదృశ్యమవుతుండటంతో...గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అమ్మాయిలకు భద్రత కరవువుతోంది. అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి ముగ్గులోకి దించుతోంది మనుషుల అక్రమ రవాణా ముఠా. వారి ముగ్గులోకి పడిన అమ్మాయిలను రాజస్థాన్‌కు తీసుకెళ్లి విక్రయిస్తోంది. బెల మండలం దౌనిగూడ గ్రామానికి చెందిన లక్ష్మి...తమ్ముడ్ని స్కూళ్లో చేర్పించేందుకు వెళ్లింది. ఇదే అదనుగా తీసుకున్న ముఠాలోని సభ్యురాలు లక్ష్మితో మాటమాట కలిపింది. భోజనం చేద్దామంటూ హోటల్‌కు తీసుకెళ్లి భోజనంలో మత్తు కలిపింది. దీన్ని తిన్న లక్ష్మి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆమెను ముఠా సభ్యురాలు రాజస్థాన్‌కు తీసుకెళ్లి లక్ష రూపాయలకు అమ్మేసింది. తమ అమ్మాయి కనిపించడం లేదని కుటుంబసభ్యులు...పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చివరకు లక్ష్మి ఇంటికి రావడంతో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది.

ఆదిలాబాద్‌ జిల్లాలో 2016లో 97 మిస్సింగ్‌ కేసులు 2017లో 103 కేసులు నమోదయ్యాయ్. ఇందులో 45 మహిళా మిస్సింగ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క సదల్‌పూర్‌ గ్రామంలోనే మూడేళ్లలో ఆరుగురు అదృశ్యమయ్యారు. వీటిలో కొన్నింటిని పోలీసులు ఛేదించినా చాలా కేసుల్లో ఎలాంటి పురోగతి లభించడం లేదు. నేరడిగొండ, ఇంద్రవెళ్లి, కెరమెరి మండలాల్లో మనుషుల అక్రమ రవాణా కేసులు సైతం నమోదయ్యాయ్. మనుషులను అమ్ముతున్నట్లు పోలీసులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయ్. మిస్సింగ్ అయిన వారంతా రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో బందీలు ఉన్నారని వారిని విముక్తి కల్పించి తల్లిదండ్రులకు అప్పగించాలని గిరిజనులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories