దిండుతో నొక్కి అత్తను చంపిన కోడలు

దిండుతో నొక్కి అత్తను చంపిన కోడలు
x
Highlights

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో అత్తను కోడులు చంపిన ఘటన వెలుగు చూసింది. ప్రతీ పనికి వంకలు పెడుతూ తిడుతోందని...

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో అత్తను కోడులు చంపిన ఘటన వెలుగు చూసింది. ప్రతీ పనికి వంకలు పెడుతూ తిడుతోందని అత్తను చంపేసింది ఓ కోడలు. అత్త ముఖుంపై దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. గ్రామానికి చెందిన కూసంపూడి నారాయణీదేవి తన అత్త మహాలక్ష్మీదేవితో తరచూ ఇంటిపనుల విషయంలో గొడవ పడుతూ ఉండేది. నారాయణీదేవి చేసే ప్రతీపని గురించి అత్త తిడుతూ ఉండటంతో విసుగు చెందిన ఆమె తాజాగా గొడవ పడింది. చివరకి దిండుతో ముఖాన్ని నొక్కిపట్టడంతో ఆమె చనిపోయింది. ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్తగారి ప్రవర్తనతో విసిగిపోయి తాను హత్యకు పాల్పడినట్టు కోడలు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories